అడవుల్లో మీడియా మౌనం – ఆపరేషన్ కగార్ Muchata.com
దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం వచ్చింది సర్…’ ఫోన్లో రిపోర్టర్. ‘ఏ జిల్లాలో జరిగింది? ఏ ప్రదేశంలో జరిగింది?’ డెస్క్ నుంచి ఆరా. ‘తెలియదు సార్..’ రిపోర్టర్ సమాధానం. ‘ఎంత మంది చనిపోయారు? ప్రముఖులెవరైనా ఉన్నారా?’ డెస్క్ నుంచి మళ్లీ ఆరా. ‘తెలియదు సార్..’ రిపోర్టర్ సమాధానం.
‘సంఘటన స్థలం ఫొటోలు కావాలి… ఎలా తీసుకువస్తావు?’ డెస్క్ నుంచి ప్రశ్న. ‘మనకు వెళ్లేది ఏమీ వుండదు సర్..’ రిపోర్టర్ బదులు. ‘మృతులను పరిశీలించడానికి, వారి కుటుంబాలతో మాట్లాడటానికి ప్రయత్నించు…?’ మళ్లీ డెస్క్. ‘మనకెవరినీ చూపించరు సర్…’ మళ్లీ రిపోర్టర్. ‘మరి ఎలా..?’ డెస్క్ అమాయకపు ప్రశ్న. ‘ఏమీ లేదు సర్. అంతా వన్‌సైడ్. పోలీసులు చెప్పిందే రాసుకోవాలి. వాళ్లు పంపించిన ఫొటోలే పెట్టుకోవాలి.. మృతుల కుటుంబాల వారెవరూ కనిపించరు సర్.. కనిపించినా నోరు మెదపరు సర్.. దండకారణ్యంలో ఇంతే. ఇప్పుడే కాదు, గత పదేళ్లుగా ఇదే పరిస్థితి సర్. మేం చేసేది రిపోర్టింగ్ కాదు సర్.. రెడీమేడ్ సమాచారం క్యారీయింగ్ మాత్రమే…’ స్పష్టంగా చెప్పాడు రిపోర్టర్. ‘అయితే సరే, పంపించు..’ డెస్క్ నుంచి ముక్తసరి స్పందన.
‘ఆపరేషన్ కగార్’ – అణచివేత పేరుతో నరమేధం
muchata.com
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మావోయిస్టుల అణచివేత పేరిట జరుగుతున్న ఘటనలను ఈ సంభాషణ ప్రత్యేకంగా రీఫ్లెక్ట్ చేస్తుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీన్ని ‘మావోయిస్టు నిర్మూలన కార్యక్రమం’గా అభివర్ణించినా, వాస్తవానికి ఇది రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసే చర్యగా మారుతోంది.
muchata
2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా దీనికి మద్దతు తెలిపారు. ఈ ప్రకటనల మధ్య, జనవరిలో బీజాపూర్‌లో 31 మంది మావోయిస్టులను కాల్చివేత తర్వాత కేంద్ర మంత్రివర్గం అందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.
muchata.com
నక్సల్స్‌పై సాయుధ పోరాటం కొత్తదేం కాదు, కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఇది పూర్తిగా నరమేధంగా మారింది. ‘ఆపరేషన్ కగార్’ పేరిట పోలీసులు దండకారణ్యంలో జరుపుతున్న ఈకపక్ష ఎన్కౌంటర్లు ఇప్పుడు సాధారణం అయ్యాయి. బీజాపూర్, దంతేవాడ, సుకుమా వంటి జిల్లాల్లోని అడవుల్లో వందలాది పోలీసులు మావోయిస్టులను తుదముట్టించేందుకు తాలూకు కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ చర్యలకు డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్) ప్రధానంగా వ్యవహరిస్తోంది, వీరికి సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు మద్దతుగా ఉంటున్నాయి.
muchata
ఎన్కౌంటర్ల వెనుక ఉన్న వాస్తవం
గత ఏడాది ఎన్కౌంటర్లలో 180 మంది చనిపోగా, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 121 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది అమాయక ఆదివాసీలేనన్నది బహిరంగ రహస్యం. ఒక్కో ఎన్కౌంటర్లో కనీసం 10-30 మంది చనిపోతున్నారు, వారిలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.
muchata.com
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ అణచివేతకు పాలకులు కఠినంగా వ్యవహరించినా, మీడియాకు తగినంత స్వేచ్ఛ ఉండేది. జర్నలిస్టులు సంఘటన స్థలాల్లో పరిశీలనలు చేసి, నిజమైన సమాచారాన్ని అందించేవారు. కానీ ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీడియాను ఎన్కౌంటర్ ప్రదేశాల్లోకి అనుమతించట్లేదు, పోలీసులు ఇచ్చిన ప్రెస్‌నోట్, ఫొటోల ఆధారంగానే వార్తలు రాయాల్సిన పరిస్థితి.
muchata
పోలీసులు విడుదల చేసే ఫొటోలు చూస్తే, మృతదేహాలను నల్లటి పాలిథీన్ కవర్లలో సక్రమంగా అమర్చినట్లు ఉంటాయి. ఆయుధాలు ఒక ఆర్డర్లో అమర్చి, ప్రదర్శనలా చూపిస్తారు. వాస్తవ పరిస్థితులు అటవీ ప్రాంతంలో భయానకంగా ఉన్నా, మీడియాకు అందే సమాచారం అందమైన కథలా మారిపోతుంది.
అడవుల్లోని మీడియా మౌనం
muchata.com
ఎన్కౌంటర్ స్థలాన్ని చూపించమని పోలీసులు మీడియా ప్రతినిధులను అడిగితే, ‘ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది, నక్సల్స్ ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉంచి ఉంటారు, భద్రతా కారణాల వల్ల లోపలికి అనుమతించలేం’ అంటూ సమాధానం వస్తుంది. మరీ ఎక్కువగా ప్రశ్నిస్తే, ‘లెక్కలు అడగొద్దు, చెప్పింది రాసుకో’ అంటూ కఠినంగా హెచ్చరిస్తారు.
muchata
ఇలా గత రెండేళ్లుగా దండకారణ్యంలో జరగుతున్న ఎన్కౌంటర్లలో గROUND రిపోర్టింగ్ పూర్తిగా నిషేధించబడింది. దీనివల్ల ‘ఆపరేషన్ కగార్’లో నిజంగా ఏమి జరుగుతోంది, అమాయకుల ప్రాణాలు ఎలా పోతున్నాయి అనే అంశాలు వెలుగులోకి రాకుండా మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు గ్రౌండ్ రిపోర్టింగ్ ద్వారా నిజాలు బయటపడేవి, కానీ ఇప్పుడు అందరూ పోలీసుల చేతికి బందీ అయ్యారు.
ఇది గాజా మీద ఇజ్రాయిల్ ఐడీఎఫ్ బాంబింగ్‌కు ఏమాత్రం తక్కువ కాదు…
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.